మీరు పొడవుగా ఉన్నారా అయితే మీరు ఆరోగ్యవంతులని అనుకుంటున్నారా …అలా
చెప్పడానికి అవకాశం లేదు. వాస్తవానికి పొడవుగా ఎదగడం అనేది వాళ్ళ జన్యువులను
బట్టి., వాళ్ళ వంశపారంపర్య పరిస్థితులను బట్టి ఉంటుంది. అయితే పసివయసులో
ఉన్నప్పుడు అంటే శిశువుగా ఉన్నప్పుడు ఎవరైతే మంచి పోషకాహారం తీసుకుంటారో.,
అలాంటి వాళ్ళు ఆరోగ్యవంతులుగా .,పొడవుగా ఎదుగుతారని వైద్య పరిశోధనలు
చెబుతున్నాయి.
పొడవాటి వారి ఆరోగ్యం విషయంలో వైద్య పరిశోధనలు కొన్ని సంచలన వార్తలు
చెబుతున్నాయి. పొడవైన వారికి దీర్ఘాయుష్షు ఉండకపోవచ్చు – అని ఆ నివేదికల
సారాంశం . దీని గురించిన ఆధారాల కోసం వైద్య పరిశోధకులు కొంతమంది పొడవాటి
వాళ్ళని ఎంచుకొని వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆ పరిశోధనల్లో
తేలింది ఏంటంటే పొడవుగా వారికీ., వారికి వచ్చిన రోగాలకు మధ్య లింక్ ఉందని
తేలింది . అలాగే దీర్ఘాయుష్షు అనేది కొంత తక్కువగా ఉందని తేలింది . అయితే ఈ
విషయంలో ఇంకా సమగ్రమైన పరిశోధనలు జరగాల్సి ఉంది .మరోవైపు మనిషి లైఫ్ స్టైల్,
అతని అలవాట్లు కూడా అతని ఆయుష్షు విషయంలో కొంత పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు
. దీనిపై మరింత పరిశోధన చేసి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. అయితే
స్థూలంగా తేలింది ఏంటంటే పొట్టి వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు అన్నది నిపుణుల
మాట . ఇటలీకి చెందిన సైనికుల మీద పరిశోధనలు జరిపినప్పుడు అయిదు అడుగుల మూడు
అంగుళాలు కంటే తక్కువగా అంటే 161. 1 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉన్న సైనికులు
ఎక్కువ కాలం జీవించారట. 1866 నుంచి 19 15 మధ్యకాలంలో చనిపోయిన సైనికుల పై
పరిశోధనలు జరిపినప్పుడు పొట్టి వాళ్ళు ఎక్కువ కాలం జీవించినట్టు తేలింది.
ఇటలీకి చెందిన ఒక గ్రామంలో ఈ పరిశోధనలు జరిగాయి. మరోవైపు 70 ఏళ్ల వయసును
ప్రామాణికంగా తీసుకుంటే పొడగాటి వాళ్లు అంతకంటే రెండేళ్ల ముందే చనిపోతున్నారట.
2017 లో జరిపిన ఒక స్టడీ వివరాలను చూస్తే పొడగరులైన బాస్కెట్బాల్ ప్లేయర్స్
తక్కువ కాలం మాత్రమే జీవించారట .ఆరు అడుగుల ఐదు అంగుళాల పొడవున్న క్రీడాకారులు
,పొట్టిగా ఉన్నటువంటి క్రీడాకారుల కంటే ముందే చనిపోయారట. కాబట్టి పొట్టి
వాళ్ళు గట్టి వాళ్ళు అనే మాట ఇప్పుడు రుజువు అవుతోంది.