మీరు సరిగా పని చేయలేక పోతున్నారా.. నీరసం వస్తోందా…అయితే దీనికి కారణాలలో
ఒత్తిడి కూడా ఒకటి.
స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి వల్ల మీ పని సామర్థ్యం బాగా తగ్గిపోతుందని
నాన్సీ స్కిమెల్ ఫెనింగ్ అనే వైద్య నిపుణుడు హెచ్చరిస్తున్నారు.. మానసిక
ఒత్తిడికి గురైతే మనం పని చేసే సామర్థ్యం పడిపోతుంది. అంటే అది ఫిజికల్
వర్క్ కావచ్చు.. మెంటల్ వర్క్ కావచ్చు… ఏదైనా ఒక మనిషి సామర్థ్యం
తగ్గిపోతుంది. దాదాపుగా 37 శాతం మంది మందికి పైగా ఇలా ఒత్తిడి వల్ల తమ పని
సామర్థ్యం కోల్పోతున్నారని తేలింది. అసలు ఈ పరిశోధన ఎందుకు జరిపారంటే
పాశ్యాత్య దేశాలలో పని సామర్థం తగ్గిపోవడంపై అధ్యయనం కోసమేనట. అసలు విషయం
ఏంటంటే తెల్లజాతీయులలో ఈ ఎఫెక్ట్ కొంత తక్కువగా ఉందని, అదే నల్లజాతీయులలో
మాత్రం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉందని అమెరికాలో జరిపిన పరిశోధనలు
చెబుతున్నాయి . జాామ్ నెట్వర్క్ ఓపెన్ అని వెబ్ సైట్ లో ఈ అంశాలను
పొందుపరిచారు. మరి ఒత్తిడిని తగ్గించుకోవాలంటే రిలాక్సేషన్ మంచిదని నివేదిక
చెప్తోంది . మానసిక ఒత్తిడికి గురైన వాళ్లలో చేతులు, కాళ్లు ఆడక పోవడం.,
చేతులకు సరైన పట్టు దొరకకపోవడం., మెమరీ – అంటే జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత
లోపించడం లాంటివి జరుగుతున్నాయట. అంతేగాదు ఏదైనా అంశాన్ని తెలుసుకోవాలనే
ఆసక్తి కూడా నశించడం జరుగుతుందని ఈ పరిశోధనలు తేల్చాయి. ఇలా ఒత్తిడికి
గురవుతున్న వారిలో వారికి తెలియకుండానే కొన్ని రుగ్మతలు కూడా
ప్రవేశిస్తున్నాయని చెబుతున్నారు . అంటే ఊబకాయం , ఉత్తేజం లేకుండా ఉండడం
జరుగుతోందట. అంతేకాదు ధూమపానం వంటి వాటికి అలవాటు కావడం లాంటివి
జరుగుతోందట. ఈ ఒత్తిడి వల్ల డిమన్షియా ., అలాగే అల్జీమర్స్ వ్యాధి కూడా
వస్తోందని తేలింది . అమెరికాలో దాదాపు 30 వేల మంది పైన జరిపిన పరిశోధనలో ఈ
అంశాలు తేలాయి. ముఖ్యంగా 45 కంటే ఎక్కువ ఉన్నటువంటి అమెరికన్ జాతీయులలో 2003
నుంచి 2007 వరకు ఈ పరిశోధనలు చేశారు . వారితో ప్రతి నెలకు ఒకసారి మాట్లాడటం.,
పరీక్షలు పెట్టడం .,వారి వివరాలు సేకరించడం ద్వారా ఈ పరిశోధన సమగ్రంగా
నిర్వహించారు. కొన్ని సందర్భాలలో అయితే మానసిక ఒత్తిడి వల్ల స్ట్రోక్ వచ్చే
ప్రమాదం కూడా ఉందని పరిశోధనలు తేల్చాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుంటే చాలు
.. అదే ఆరోగ్యదాయకమని చెబుతున్నారు.