గుండె వ్యాధులను నిర్ధారించడానికి ఇప్పటిదాకా కొలెస్ట్రాల్ పరీక్షలు ఎల్డీఎల్
పరీక్షలు చేస్తున్నారు.రక్తనాళాలలో బ్లాక్ ఏర్పడితే దానిని కనుక్కోడానికి
జరిపే పరీక్షలన్నీ చాలా వ్యయమయ్యేవే. అయితే ఒక రకమైన ప్రోటీన్ పరీక్ష ద్వారా
హృదయ రోగాలను గుర్తించవచ్చని అమెరికన్ కార్డియాక్ నిపుణులు చెబుతున్నారు. ఈ
అంశాలు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. గుండె
రోగాన్ని గుర్తించాలంటే రక్త పరీక్ష చేయడం ద్వారా ఆ రక్త పరీక్షలో ఒక
నిర్దిష్ట ప్రోటీన్ పరిస్థితిని విశ్లేషించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని
నిర్ధారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బి – 100 అనే ప్రోటీన్ పరిమాణాన్ని
గుర్తించడం ద్వారా కొలెస్ట్రాల్ పెరిగిందా.. లేదా …చెప్పవచ్చని అంటున్నారు .
శరీరంలో కొలెస్ట్రాల్ పెంచడానికి ఈ ప్రోటీన్ ఉపయోగపడుతుందని వారి పరిశోధనల
సారాంశం.. చెడు హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ గానీ., అలాగే శరీరానికి మంచిని
చేసే కొలెస్ట్రాల్ లో గాని ప్రోటీన్ ఉండదనేది ఈ పరిశోధనల సారాంశం. కేవలం
ఎల్డీఎల్ కొలెస్ట్రాల్., అలాగే చెడుని చేసే కొలెస్ట్రాల్ లో మాత్రమే ఈ
ప్రోటీన్ ఉంటుందని వారు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ప్రోటీన్ టెస్ట్
ద్వారా ఎవరికైనా హృదయ సంబంధిత వ్యాధి ఉందా ..లేదా ..అనేది తెలుసుకోవచ్చు.
ఇక్కడ మరో అంశం చెప్పాలి . ఒక మనిషిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ సాధారణ
స్థాయిలోనే ఉన్నా కూడా హృదయ సంబంధిత రుగ్మతలు రావచ్చు. అయితే ఈ ప్రోటీన్
టెస్ట్ ద్వారా అలాంటి పరిస్థితులు కూడా గుర్తించే అవకాశం ఉంది. అనారోగ్యంతో
ఆస్పత్రులకు వచ్చే వారి కంటే ఆసుపత్రులకు రాని సాధారణ ప్రజలలో కూడా హృదయ
సంబంధిత సమస్యలు ఉండవచ్చనీ., అందరికీ ఇలాంటి ప్రోటీన్ టెస్ట్ చేయడం ద్వారా
వారికి గుండెపోటు వస్తుందా లేదా అనేది నిర్ధారించవచ్చని వాఫీ మోమిన్ అనే
అమెరికన్ కార్డియాలజిస్ట్ సూచిస్తున్నారు.