కీళ్లు కదులుతున్నప్పుడు వస్తున్న చిన్నపాటి శబ్దాలు కావచ్చు. లేకపోతే
కడుపులో నుంచి వస్తున్న వివిధ రకాల నాయిస్ కావచ్చు . బ్రేవ్ మని త్రేన్చవచ్చు.
లేదా గ్యాస్ రిలీజ్ కావచ్చు ఇదంతా శబ్దాలే ..శరీరం నుంచి వస్తున్నవే. ఇలా తమ
కడుపు నుంచి శబ్దాలను వినగలిగినప్పుడు కొన్నిసార్లు జనం అసౌకర్యంగా
భావిస్తారని చికాగో మెడిసిన్ విశ్వవిద్యాలయం గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అయిన
డెన్ లేడీ అంటారు. అసలు ఈ శబ్దాలు ఎందుకు వస్తున్నాయి.. కడుపు నుంచి ఈ చర్యలు
ఎందుకు కలుగుతున్నాయి .,అంటే ఇది సాధారణ జీర్ణ క్రియ కు సంబంధించినదనీ ఆకలికి
సంబంధించినది అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఇది కడుపులోని మృదువైన
కండరాలు సంకోచించడం, వ్యాకోచించడం ద్వారా వస్తున్న శబ్దాలు అంటారు. మీరు
తీసుకునే ఆహారాన్ని మీ చిన్న పేగు కిందికి నెట్టడం., అలాగే పెద్ద పేగులోకి
నెట్టడం లాంటి చర్యల వల్లే ఈ శబ్దాలు వస్తున్నాయని అంటారు . వైద్య పరిభాషలో
చెప్పాలంటే దీన్ని బార్బోరెడ్మస్ అంటాడు. ఇంకా చాలా సులభంగా చెప్పాలంటే మీ
పొట్టను ఒక వాషింగ్ మిషన్ లాగా ఆలోచించండని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
చెబుతున్నారు
మీరు తింటున్నప్పుడు ఆహారం ,ద్రవం, అలాగే గాలి కూడా జీర్ణాశయం గుండా
వెళుతుంది. అలా వెళుతున్నప్పుడు ఒక రకమైన ఒత్తిడి కలుగుతుంది. దానివల్లే ఈ
శబ్దాలు వస్తాయని వైద్య నిపుణుల భావన. అలాగే ఆకలి అయినప్పుడు కూడా కడుపు నుంచి
ఒక శబ్ద సంకేతం వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి…. ఒక పిజ్జా సెంటర్
కి వెళ్లి అక్కడ వంట రూమ్ లో వాసన చూశారని అనుకోండి… అప్పుడు మెదడు
యాక్టివ్ అయ్యి కడుపునకు ఒక రకమైనటువంటి సంకేతాన్ని పంపుతుంది. ఇది ఎలా
జరుగుతుందంటే మీ మెదడు నుంచి మీ కడుపునకు గ్రలిన్ అనే ఆకలిని కలిగించే
హార్మోన్ ను విడుదల చేయమని చెప్తుంది . సరిగ్గా అదే సమయంలో మీ ప్రేగులతోపాటు
కడుపు నకు కూడా సంకోచించేలా సిగ్నల్స్ వస్తాయి . అలా మీకు వినిపించే ఈ శబ్దం
కడుపు పేగులు సంకోచించడం ద్వారా వచ్చేదిగా తెలుస్తుంది. అంటే కడుపులోని
కండరాలు ఆకలిని వ్యక్తపరుస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది.
ఒకవేళ ఆకలి కలగలేదనుకోండి… ఆకలి లేదనుకోండి… అయినా కూడా కడుపు నుంచి వివిధ
రకాల శబ్దాలు వస్తున్నాయంటే అది కడుపులో జీర్ణ క్రియ కొంత సమస్యాత్మకంగా ఉందని
చెప్పడానికి సంకేతంగా చెప్పాల్సి ఉంటుంది . కొన్ని ఆహార పదార్థాలు అంటే
బఠానీలు, కాయ ధాన్యాలు, క్యాబేజీ, బ్రకోలీ., కాలీఫ్లవర్ లాంటి ఆహార పదార్థాలు
కడుపులో చేరిన తర్వాత అవి విచ్ఛిన్నమై ., అంటే బాగా జీర్ణం అయ్యే ప్రక్రియ
కొంత క్లిష్టం కావడం వల్ల కడుపులో కొన్ని శబ్దాలు వస్తాయని వైద్యుల
అభిప్రాయం. అలాగే కొన్ని కృత్రిమ తీపి పదార్థాలు., జిగురుగా ఉండే తీపి
పదార్థాలు లాంటివి అరగడానికి చాలా కష్టతరం అవుతుంది. అలాంటప్పుడు కూడా కడుపు
నుంచి ఆ జీర్ణ ప్రక్రియ సాగుతున్న విధానం వల్ల సౌండ్స్ వస్తుంటాయని
చెబుతున్నారు.
మీకు ఆకలిగా ఉన్నా శబ్దాలు వస్తాయి.. ఒకవేళ ఆకలి లేకపోయినా… కావలసినంత
ప్రోటీన్ ఫుడ్ అందకపోయినా.. కడుపు వింత శబ్దాలు చేస్తుంది. అలాగే ఎక్కువ
తిన్న సందర్భాల్లో కూడా అంటే బిగ్ మిల్ తీసుకున్న సందర్భాల్లో కూడా కడుపు
నుంచి శబ్దాలు వస్తాయి . ఆల్కహాల్ తీసుకున్నప్పుడూ ఫ్యాట్ మిల్ తీసుకున్నా
కూడా శబ్దాలు వస్తాయి. కాబట్టి వస్తున్న శబ్దాలు దేనికి సంబంధించినది అని
బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి పొట్ట నుంచి వచ్చే శబ్దాలు ఒక సాధారణ ప్రక్రియ మాత్రమే అని
గుర్తించాలి. అది ఆకలికి సంబంధించింది కావచ్చు. జీర్ణ క్రియ కు సంబంధించింది
కావచ్చు.. అలా కాకుండా అసాధారణంగా విపరీతమైన శబ్దాలు వస్తుంటే మాత్రం దాని
గురించి తీవ్రంగా ఆలోచించాలి. అప్పుడు వైద్యులను సంప్రదించవచ్చని గ్యాస్ట్రో
ఎంటరాలజిస్టులు చెబుతున్నారు. ఇదే శబ్దాలతో పాటు నొప్పి గానీ., కడుపు ఉబ్బరం
గానీ., పేగుల కదలికలో మార్పులు గానీ., అలాగే మలవిసర్జనలో సమస్యలు కానీ
వస్తుంటే మాత్రం వైద్యులను సంప్రదించవచ్చని హెచ్చరిస్తున్నారు.