పారాసెటమాల్.. గుండె పోట్లకు, కార్డియాక్ అరెస్టులకు కారణమవుతుందా? వినడానికి
కంగారు కల్గిస్తున్నా… ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ హార్ట్ జర్నల్ చేసిన
పరిశోధనలసారం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. చిన్న జ్వరం టాబ్లెట్టే కదా
అని లైట్ తీసుకుంటే.. మీప్రాణాలే తీసేస్తుందని పరిశోధనలు తేల్చిచెబుతున్నాయి.
జ్వరం… ఒళ్లునొప్పులు… ఇవి చాలా మందికి సర్వసాధారణం. వెంటనే ఒక పారాసిటమాల్
టాబ్లెట్ వేసుకుంటే సరి. అందుకే.. చాలా ఇళ్లలో పోపుల పెట్టేలో వస్తువులా
పారాసిటమాల్ టాబ్లెట్లు కనిపిస్తాయి. ఈ కరోనా కాలంలో మెడికల్ షాపుల్లో
రికార్డు స్థాయిలో అమ్ముడు పోయిన డ్రగ్.. పారాసిటమాల్. కానీ ఇప్పుడు ఇదే
పారాసెటమల్ డేంజర్ అంటున్నాయి పరిశోధనలు. ఇటీవల కాలంలో ఆకస్మికంగా ఆగిపోతున్న
గుండెకు ఈ టాబ్లెట్ల వాడకం కూడా కారణమనే వాదనకు బలం చేకూరుతుంది. ఇంతకీ
పారాసిటమాల్‌లో ఏముంది? ప్రాణాంతకంగా ఎందుకు మారుతోంది…?
హార్ట్ అటాక్స్ కారణాల్లో బీపీ ప్రధానమైంది. ఇలాంటి బీపీ పెరగడానికి సోడియం
అంటే ఉప్పు ప్రధాన కారణం. ఉప్పు ఎక్కువగా తినడం అనేది గుండె, ఇతర ప్రసరణ
వ్యవస్థలకు ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. ఉప్పులోన సోడియం మిళితం అయి ఉంటుంది.
అలాంటి సోడియం నిల్వలను పారాసిటమాల్ టాబ్లెట్స్ పెంచుతున్నాయట. ఈ మాటలు
అంటున్నది ఎవరో కాదు.. ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ హార్ట్ జర్నల్. అనడమే
కాదు… తన పరిశోధనలను ప్రపంచానికి విడుదల చేసింది. ప్రతి పారాసిటమాల్
టాబ్లెట్‌లో సోడియం గణనీయమైన మొత్తంలో ఉంటుందని తేల్చిచెబుతోంది. ఇలాంటి
టాబ్లెట్స్ విచ్చలవిడిగా వాడటం వల్ల సోడియం నిల్వలు పెరిగి హార్ట్ అటాక్స్,
కార్డియాక్ అరెస్టులకు కారణమవుతుంది హెచ్చరిస్తోంది. యూరోపియన్ హార్ట్
జర్నల్‌తో పాటు చైనాలోని సెంట్రల్ సౌత్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు
ఎక్కువ కాలం పాటు సోడియం కలిగిన పారాసిటమాల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల
గుండెపోటు, స్ట్రోక్ లేదా గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు.
పరిశోధకులు …. 60 నుంచి 90 ఏళ్ల మధ్య వయస్సు గల దాదాపు 300,000 మంది వ్యక్తుల
నుండి డేటాను విశ్లేషించారు. రోగులలో సగం మందికి అధిక రక్తపోటు ఉంది.
పరిశోధకులు ఈ పరిశోధనను వివిధ దశల్లో ఒక సంవత్సరం పాటు కొనసాగించి.. డేటాను
వెల్లడించారు.