బండిని నడిపే ఇంధనం రక్తం. మరి ఆ రక్తానికి ఇన్ఫెక్షన్ సోకితే..! శరీరమంతా
విషమయం అవుతుంది. కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. రక్తం విషమయం
కావడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిని తెలుసుకుని.. ముందు జాగ్రత్తలు
తీసుకుంటే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
రక్తాన్ని విషతుల్యం చేసే వ్యాధిని సెప్టిసీమియాగా పిలుస్తారు. దీనినే బ్లడ్
ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు. ఇది అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది.
శరీరంలోని వివిధ భాగాలకు ఇన్ఫెక్షన్ సోకినట్లుగానే అది రక్తానికి వ్యాపించి
శరీరాన్ని పూర్తిగా విషమయం చేస్తుంది ఒక్కోసారి శరీరంలోకి ప్రవేశించిన
పరాన్నజీవులు విసర్జించే విషపూరిత వ్యర్ధాల వల్ల శరీరం విషపూరితమవుతుంది.
క్రమంగా అది శరీరమంతటికీ పాకుతుంది. ఏదైనా గాయం తగిలి ఆ భాగం సెప్టిక్ అయిన
మాదిరిగానే సెప్టిసీమియా కారణంగా శరీరంలోని కీలకమైన అవయవాలన్నీ సెప్టిక్ అయి
ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.
ఇది ప్రధానంగా అంటువ్యాధి. ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, వైరల్
ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తుంది. అలాగే మద్యానికి బాసిన
అయిన వారికి, డయాబెటిస్తో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి, సరైన పోషకాహారం
తీసుకోకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే వారికి, రోగ నిరోధక వ్యవస్థను
దెబ్బతీసే కొన్ని రకాల మందులను యధేచ్ఛగా వేసుకునే వారికి సెపిటసీమియా వచ్చే
అవకాశాలు ఎక్కువ. యాంటీ బయాటిక్స్ను విచక్షణారహితంగా వాడటం వల్ల అది క్రమంగా
రోగ నిరోధక శక్తిని క్షీణిం పచేస్తుంది. శరీరంలో చేరిన సూక్ష్మజీవులు ఈ యాంటీ
బయాటిక్స్ ప్రభావాన్ని తట్టుకునే శక్తిని పుంజుకుంటాయి. దాంతో యాంటీ
బయాటిక్స్ నిరుప యోగంగా మారి పోతాయి.
ఈ దశలో శరీరంలో రోగని రోధక శక్తి నశించటం,. వల్ల అది హానికర మైన సూక్ష్మజీవుల
దాడిని నివారించలేని స్థితికి చేరుతుంది. అలాంటి పరిస్థితుల్లో సెప్టిసీమియా
రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
గుండె జబ్బులకు చికిత్స పొంది కోలుకునే సమయంలో సెప్టిసీమియా వ్యాధికి గురయ్యే
అవకాశాలు చాలా ఎక్కువ. చికిత్స పొందిన హృద్రోగుల్లో 40 నుంచి 60శాతం మంది
నెలరోజుల్లో సెప్టిసీమియాకు గురై మరణించే ప్రమాదం ఉంటుంది. అందుకే అలాంటి
సందర్భాల్లో రోగి పరిస్థితిని సత్వరం గుర్తించి ఆస్పత్రికి చేర్చి చికిత్స
చేయిఆఞచాల్సటన అవసరం ఉంటుంది. ఊపిరితిత్తుల జబ్బులు వచ్చిన వారిలో సైతం 40శాతం
మందిలో సెప్టిసీమియాకు దారితీసే ప్రమాదం ఉంది. ప్రధానంగా న్యూమోనియా వచ్చిన
సందర్భాలలో ఇది ఎక్కువ. అలాగే ఏ కారణం గానైనా పొట్టలో ఇన్ఫెక్షన్ వస్తే
32శాతం మందిలో అది సెప్టిసీమియాకు దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా
పెరిటోనైటిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భంలో పొట్ట మొదలుకొని, జీర్ణకోశ
వ్యవస్థలో పేగు వరకు ఏ భాగానికైనా రంధ్రం పడటం(పెర్ఫోరేషన్) జరిగినపుడు
పొట్టలోని స్రావాలు శరీరంలోకి ప్రవేశించి క్రమంగా శరీరమంతా విషపూరితంగా
మారిపోతుంది