నరాలు ఒత్తిడికి గురైనప్పుడు శరీరం తిమ్మిర్ల రూపంలో సంకేతాలిస్తుంది.
ఒక్కోసారి అక్కడ స్పర్శ కూడా తెలీదు. ఈ పరిస్థితినే ‘న్యూరోపతి’ అంటారు.
అయితే, తిమ్మిర్లు అన్నీ ఒకే రకమైనవిగా భావించకూడదు. వీటిలో కూడా తేడాలు
ఉంటాయి. ఎక్కువ సేపు కదలకుండా కుర్చున్నప్పుడు సూదులతో గుచ్చుతున్నట్లుగా
ఉండటం, మంటలు ఏర్పడటాన్ని పాజిటి వ్ తిమ్మిర్లుగా పేర్కొంటారు. నెగటివ్
తిమ్మిర్లు దీర్ఘకాలికంగా వేధిస్తాయి. ఇవి ఎక్కువ నొప్పి పెడతాయి. ఈ తిమ్మిర్ల
వల్ల స్పర్శ కూడా కోల్పోతారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు నెగటివ్ తిమ్మిర్లు
ఏర్పడతాయి. వీటిని ‘ప్రెషర్ పాల్సీస్’ అని కూడా అంటారు. వేళ్ల తిమ్మిరి కూడా
పరిశోధించవలసిన కొన్ని ఆరోగ్య రుగ్మతల లక్షణం కావచ్చు.
చేతిపై పడుకున్నప్పుడు మీ మోచేయి కుదించబడి ఉండవచ్చు. దీని కారణంగా మీ
వేళ్లలో రక్త ప్రవాహం తాత్కాలికంగా లేకపోవచ్చు. అయినప్పటికీ, వేళ్ల తిమ్మిరిని
విస్మరించకూడదు.ఎందుకంటే అవి కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, డయాబెటిక్ న్యూరోపతి,
విటమిన్ లోపం నుంచి స్ట్రోక్ వరకు అనేక అనారోగ్యాలను సూచిస్తాయి.
తిమ్మిర్లు ఎక్కువ రోజులు వేధిస్తుంటే.. తప్పకుండా వైద్యులను
సంప్రదించాలి. తిమ్మిర్లు మీ శరీరంలో తీవ్రమైన అనారోగ్యానికి సంకేతాలని
గుర్తించాలి. అయితే, ఈ తిమ్మిర్లు చాలా వ్యాధులతో ముడిపడి ఉంటాయి. అందుకే
వైద్యులు ముందుగా రోగికి థైరాయిడ్, డయబెటీస్, విటమిన్ డెఫిషియన్సీ పరీక్షలు
నిర్వహిస్తారు. ‘నర్వ్ కండక్షన్’ ద్వారా తిమ్మిర్లను అంచనా వేస్తారు. ఒక వేళ
మీ నోట్లో పుండ్లు (మౌత్ అల్సర్), కీళ్ల నొప్పుల్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే
‘కనెక్టివ్ టిష్యూ డిజార్డర్’గా భావిస్తారు.