వ్యాధి. ఇటీవలికాలంలో ఎంతోమంది అల్జీమర్ వ్యాధి బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు. ఇలా మధ్య వయసులో ఉన్నప్పుడు చిన్న చిన్నగా మొదలైన
మతిమరుపు.. చివరికి చిత్తవైకల్యానికి దారి తీస్తుంది. చివరికి సొంత వాళ్లని
సైతం మరచిపోయే వరకు దారి తీస్తుంటుంది. ఇక ఇలాంటి దుర్భరమైన వ్యాధి బారినపడి
ప్రస్తుతం ఎంతో మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే చిత్తవైకల్యం
వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం
మారుతున్న జీవన శైలి ప్రకారం చిత్తవైకల్యం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చిత్తవైకల్య రోగులు 2050 నాటికి మూడు రెట్లు పెరుగుతారని
వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చాలా విషయాలను
మర్చిపోవడం, అంటే జ్ఞాపకశక్తి కోల్పోవడం..శాస్త్రీయ భాషలో దీనిని చిత్తవైకల్యం
అంటారు. క్రమేపీ ప్రపంచంలో ఈ చిత్తవైకల్యం బాగా పెరుగుతోంది. ఇటువంటి రోగుల
సంఖ్య 15 కోట్లను దాటిపోతుందని వారంటున్నారు. ధూమపానం, బాడీ మాస్ ఇండెక్స్
వంటివి కూడా చిత్తవైకల్యానికి ప్రమాద కారకాలుగా ఉన్నాయి.
తేలికపాటి అభిజ్ఞా బలహీనత, చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గించడానికి కనీసం
మితమైన-తీవ్రత కలిగిన శారీరక శ్రమ అవసరాన్ని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.
63, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో చిత్తవైకల్యం అధికంగా ఉంటుంది.
వ్యాయామానికి దూరంగా ఉండటం వల్ల కూడా చిత్తవైకల్యం వచ్చే అవకాశం ఉంటుందట.
చిత్త వైకల్యం ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రతిరోజు వ్యాయామం చేయడం తప్పనిసరి
అని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా తృణ ధాన్యాలు, గింజలు, విత్తనాలు
అధికంగా ఉండే ఆహారాన్ని అనుసరించే వారితో పోల్చితే అనారోగ్యకరమైన ఆహారాన్ని
తీసుకునే వ్యక్తుల్లో చిత్తవైకల్యం ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన
పరిశోధనలో తేలిందని పరిశోధకులు సూచించారు.