1947 నాటి యుద్ధ వీరులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రశంసలు కురిపించారు. దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టడంలో జమ్మూ, కాశ్మీర్ ప్రజలు చేసిన కృషిని కూడా అయన ప్రశంసించారు. పదాతిదళ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని పాత ఎయిర్‌ఫీల్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, “నవజాత పాకిస్తాన్ అసలు లక్షణాలు దాని ప్రారంభ దశ నుంచే చూడవచ్చు” అని ఆయన అన్నారు.
‘విలీన సాధన’పై సరిగ్గా 75 సంవత్సరాల క్రితం, అంటే 1947 అక్టోబర్ 26న అప్పటి మహారాజా హరి సింగ్ సంతకం చేసిన ఒక రోజు తర్వాత, జమ్మూ, కాశ్మీర్‌ను పాకిస్తాన్ దళాల నుంచి రక్షించడానికి, భారత సైన్యానికి సంబంధించిన ఒక సిక్కు రెజిమెంట్ దళాలు, డకోటా ఎయిర్‌క్రాఫ్ట్‌లో శ్రీనగర్‌లోని పాత ఎయిర్‌ఫీల్డ్‌కు చేరుకున్నాయని గుతూ చేశారు.