పీవీ సింధు.. మూడేళ్ల తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో మరోసారి టాప్-5లో చోటుదక్కించుకొంది. మంగళవారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్ జాబితాలో సింధు ఒక స్థానం మెరుగుపరచుకొని ఐదో ర్యాంక్‌లో నిలవగా.. సైనా నెహ్వాల్ 33వ ర్యాంక్‌కు పడిపోయింది. హెచ్‌ఎ్‌స ప్రణయ్ ఒక మెట్టెక్కి 12వ ర్యాంక్ సాధించగా.. లక్ష్య సేన్, శ్రీకాంత్ 8, 11 స్థానాల్లో నిలిచారు. డబుల్స్‌లో భారత టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి 8వ ర్యాంక్ దక్కించుకున్నారు. సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీ 24వ ర్యాంక్‌కు, ట్రిసా జాలీ-పుల్లెల గాయత్రి జంట 27వ ర్యాంక్‌కు చేరుకున్నారు.