వివాహంలో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛరాజ్యాంగంలో అంతర్భాగమని, అందులో విశ్వాసానికి సంబంధించిన ప్రశ్నలకు ఎలాంటి సంబంధంలేదని ఢిల్లీహైకోర్టు అభిప్రాయపడింది. జంటల రక్షణ కోసం పోలీసులు త్వరితగతిన, సున్నితత్వంతో వ్యవహరించాలని సూచించింది.
కుటుంబ సభ్యులతో సహా ఇతరులు ఎవరి నుంచి అయినా వారికి రక్షణ కల్పించాలని ఆదేశించింది. తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పెళ్లిచేసుకున్నమహిళ కుటుంబీకులు ఫిర్యాదుదారుడిపై హత్యాయత్నం , భౌతికదాడికి పాల్పడ్డారని ఆరోపించిన కేసు నుంచి ఉత్పన్నమయ్యే బెయిల్ పిటిషన్లను డీల్ చేస్తున్నప్పుడు ఈ అంశం కోర్టు పరిశీలనకు వచ్చింది. ఈ సందర్భంగా ఢిల్లీహైకోర్టు ఫిర్యాదుదారుని భార్య కుటుంబసభ్యులు వారిని అపహరించి, దారుణంగా కొట్టి, గొడ్డలితో అతని ప్రైవేటు భాగాన్నికత్తిరించి, కత్తితో గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.