అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘థ్యాంక్ గాడ్’ చిత్రంపై విచారణకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. చిత్రగుప్తుడిని అవమానపరిచేలా చిత్రీకరించినందున అక్టోబర్ 25న సినిమా విడుదల చేయడాన్ని నిలిపి వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ కోసం జాబితా చేయడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది.
ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ బేల ఎమ్ త్రివేదితో కూడిన ధర్మాసనం శ్రీ చిత్రగుప్తా వెల్ఫేర్ ట్రస్ట్ అభ్యర్థనను నవంబర్ 1 న విచారణకు జాబితా చేసింది.
సినిమా విడుదలపై స్టే విధించడంతో పాటు, ‘యూట్యూబ్’ వంటి ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి దాని ట్రైలర్లు, పోస్టర్లను తొలగించాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఇందులో “అవమానకరమైన వ్యక్తీకరణలు, చర్యలు, ప్రకటనలు, డైలాగ్‌లు ఉన్నాయి. చిత్రగుప్తుని పాత్రలో చుట్టుపక్కల చిత్రాలు, వీడియోలు దారుణంగా ఉన్నాయి” అంటూ పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్ అత్యవసర విచారణ కోసం జాబితా చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.