టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మార్కస్ స్టోయినిస్ బ్యాట్‌తో విరుచుకుపడి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. శ్రీలంక నిర్దేశించిన 158 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా 26 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ (11) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత మిచెల్ మార్ష్ (17), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23) త్వరగానే పెవిలియన్ చేరినా క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ అరోన్ ఫించ్, మార్కస్ స్టోయినిస్ జట్టును విజయం దిశగా నడిపించారు. ఫించ్ అండగా స్టోయినిస్ మైదానంలో బ్యాట్‌తో చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో మెరుపులు మెరిపించాడు. ఒకానొక సమయంలో ఉన్న బంతులకంటే చేయాల్సిన పరుగులు దాదాపు రెండింతలుగా ఉన్న వేళ సిక్సర్ల వర్షం కురిపించి వాతావరణాన్ని తేలికపరిచాడు. 18 బంతులు మాత్రమే ఎదుర్కొన్న స్టోయినిస్ 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. అతడి దెబ్బతో 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆసీస్ విజయం సాధించింది. ఫించ్ 42 బంతుల్లో సిక్సర్‌తో 31 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పాథుమ్ నిశ్శంక 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా ధనంజయ డిసిల్వ 26, అసలంక 38 పరుగులు చేశారు.