ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్ (ఎంసీబీ) జిల్లాలో కత్తితో బెదిరించి 32 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తపై ఓ మైనర్ బాలుడు ఆమె కార్యాలయంలోనే అత్యాచారానికి పాల్పడినట్టు శనివారం పోలీసులు తెలిపారు.17 ఏళ్ల నిందితుడిని, అతడి ఇద్దరు సహచరులను తాము అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఒక పోలీసు అధికారి తెలిపారు.
జాగ్రఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిప్చిప్ గ్రామ పంచాయతీలో గల ఆరోగ్య ఉప కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) జాగ్రఖండ్ దీపక్ సైనీ తెలిపారు.శనివారం ఉదయం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామ శివార్లలో గల కార్యాలయంలో ఆ మహిళ ఒంటరిగా ఉండడంతో తన ముగ్గురు సహచరులతో ఆ బాలుడు లోపలికి ప్రవేశించి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్టు అతను చెప్పాడు.
మూలం: ఎన్.డి.టి.వి.