పండుగ సందర్భాలలో విక్రేతలు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీల నుంచి బహుమతులు స్వీకరించబోమని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) (ఢిల్లీ)కు కొత్తగా నియమితులైన డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ ఒక ఉత్తర్వులో తెలిపారు. డాక్టర్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జారీ చేసిన ఉత్తర్వుల్లో భాగమే ఈ కొత్త ఆర్డర్.
“ఎయిమ్స్‌తో అనుబంధించబడిన లేదా అనుబంధించాలనుకునే అనేక మంది విక్రేతలు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీల ప్రతినిధులు పండుగ శుభాకాంక్షల కోసం దిగువ సంతకం చేసిన వారిని బహుమతులు, స్వీట్లు, పుష్పగుచ్ఛాలు మొదలైన వాటితో కలవడానికి ప్రయత్నిస్తున్నారని గుర్తించబడింది” అని డాక్టర్ శ్రీనివాస్ జారీ చేసిన ఆర్డర్లో పేర్కొన్నారు. అలాంటి వారి నుంచి బహుమతులు, శుభాకాంక్షలను తాను స్వీకరించనని ఆయన తెలిపారు. “నేను అలాంటి వ్యక్తుల నుంచి బహుమతులు, శుభాకాంక్షలు స్వీకరించను. దీని ప్రకారం, క్రింద సంతకం చేసిన వారి కార్యాలయంలో పోస్ట్ చేయబడిన భద్రతా విభాగం, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది అటువంటి సందర్శకులను నా కార్యాలయంలోకి అనుమతించవద్దని అభ్యర్థిస్తున్నా ”అన్నారాయన. ఇటీవల ఆయన చేసిన ఉత్తర్వులు వార్తల్లో హాట్ టాపి క్ గా నిలుస్తున్నాయి.
మూలం: ఇండియన్ ఎక్స్‌ప్రెస్