రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచిన 31 ఏళ్ల సిమోనా హలెప్ (రొమేనియా) డోప్ పరీక్షలో విఫలమైంది. ఈ ఆగస్టులో యూఎస్ ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షలో 9వ ర్యాంకర్ హలెప్ నిషేధిత డ్రగ్ తీసుకున్నట్టు రుజువైంది. దీంతో ప్రస్తుతానికి ఆమెపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్టు అంతర్జాతీయ టెన్నిస్ స్వచ్ఛత సంస్థ శుక్రవారం ప్రకటించింది. బి శాంపిల్ పరీక్షలోనూ పాజిటివ్ ఫలితం వస్తే.. హలెప్ పై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశముంది.