టీ-20 ప్రపంచకప్ లో పాక్ ఇచ్చిన టార్గెట్‌ను టీమిండియా చివరి ఓవర్లో ఛేదించి విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం చేజిక్కించుకుంది. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు.160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 31 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా 4 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 15 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు ఉన్నాయి. అక్షర్ పటేల్ కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అతను రనౌట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ ఒక పరుగు చేసి ఔటయ్యాడు. ఆపై క్రీజులోకి వచ్చిన కోహ్లి, హార్దిక్ లు 78 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి క్షణంలో హార్దిక్ ఔటయ్యాడు, కానీ కోహ్లీ చివరి వరకు నిలిచి, టీమిండియాను గెలిపించాడు. విరాట్ కోహ్లీ 82 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. పాండ్యా 37 బంతుల్లో 40 పరుగులు చేశాడు. 2 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు.
తొలుత టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. కెప్టెన్ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ ఆరంభంలోనే భారత బౌలర్లు చెలరేగారు. బంతిని వికెట్‌కు ఇరువైపులా స్వింగ్ చేస్తూ భువనేశ్వర్ బంతులు విసరడంతో.. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఆత్మరక్షణలో పడిపోయాడు. ఆ ఓవర్లో భువీ వైడ్ వేయడంతో పాక్ ఖాతా తెరిచింది. మరుసటి ఓవర్ తొలి బంతికే కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను అర్షదీప్ సింగ్ ఎల్బీతో పెవిలియన్ చేర్చాడు. మరుసటి ఓవర్ చివరి బంతికి రిజ్వాన్‌ను సైతం అర్షదీప్ ఔట్ చేశాడు. దీంతో పాకిస్థాన్ 4 ఓవర్లలో 15 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇఫ్తికార్ అహ్మద్, షాన్ మసూద్ పాకిస్థాన్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 76 పరుగులు జోడించారు.
అక్షర్ పటేల్‌ను టార్గెట్ చేసిన ఇఫ్తికార్.. ఒకే ఓవర్లో మూడు సిక్సులు బాదడంతోపాటు 21 పరుగులు రాబట్టాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇఫ్తికార్ (34 బంతుల్లో 51)ను షమీ ఔట్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్య రెండు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టడంతో పాక్ తడబడింది. డేంజరస్ ప్లేయర్ ఆసిఫ్ అలీ(2)ని అర్షదీప్ ఔట్ చేశాడు. ఈ దశలో ఇఫ్తికార్ అహ్మద్, షాన్ మసూద్ పాకిస్థాన్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. అక్షర్ పటేల్‌ను టార్గెట్ చేసిన ఇఫ్తికార్.. ఒకే ఓవర్లో మూడు సిక్సులు బాదడంతోపాటు 21 పరుగులు రాబట్టాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇఫ్తికార్ (34 బంతుల్లో 51)ను షమీ ఔట్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్య రెండు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టడంతో పాక్ తడబడింది. డేంజరస్ ప్లేయర్ ఆసిఫ్ అలీ(2)ని అర్షదీప్ ఔట్ చేశాడు.