దేశంలో కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వెలుగుచూసిన వేళ..
జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు
ప్రస్తుతానికి దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని కేంద్రం వెల్లడించింది
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే ఈ సమయంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. దీపావళి సెలవుల వేళ వీటివల్ల దేశంలో మరో ఉద్ధృతికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకమని చెబుతున్నారు. అలాగే బూస్టర్ డోసు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్తున్నారు. అయితే కొత్త కేసులు అదుపులోనే ఉండగా.. క్రియాశీల కేసులు క్రితం రోజుతో పోలిస్తే కాస్త తగ్గడం ఊరటనిస్తోంది.
శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా గణాంకాలు ఇలా ఉన్నాయి..
* నిన్న చేసిన నిర్ధారణ పరీక్షలు : 2,09,088
* కొత్తగా నమోదైన కేసులు : 2,112
* పాజిటివిటీ రేటు : 1.01 శాతం
* మొత్తం మరణాల సంఖ్య : 5,28,957
* మొత్తం రికవరీలు : 4.40 కోట్లు (98.76%)
* ప్రస్తుతం క్రియాశీల కేసులు : 24,043(0.05%)
* మొత్తం పంపిణీ చేసిన టీకాలు : 219.53 కోట్లు