ఇటీవల పూజాహెగ్డే కాలికి గాయం కావడంతో కొన్ని రోజులపాటు షూటింగ్లకు దూరమయ్యారు అనుకున్నారంతా. అయితే ఆమె మాత్రం నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ షూటింగ్లో పాల్గొన్నారు. గురువారం ఆమె కాలికి గాయమైనట్లు పూజా ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే. శుక్రవారం షూటింగ్లో మేకప్, హెయిర్ డ్రెస్ చేయించుకుంటున్న వీడియో షేర్ చేసి ఆశ్చర్యం కలిగించింది. చీలమండలో చీలక ఏర్పడడం వల్ల ఆమె కొద్దిరోజులు రెస్ట్ తీసుకుంటుందనీ, దానితో షూటింగ్లు డిస్ట్రబ్ అవుతాయని అనుకున్నారంతా. కానీ గాయమై రోజు తిరగకుండానే పూజా సెట్లో సందడి చేస్తోంది.
కాలికి బ్యాండేజీతో మేకప్ రూమ్లో ఉన్న ఫొటోను ఇన్స్టా స్టాటస్లో షేర్ చేసి ‘షో నడవాల్సిందే’ అని క్యాప్షన్ ఇచ్చింది. గాయమైన కాలితో కూడా షూటింగ్లో పాల్గొవడం పట్ల పలువురు ఆమెను ప్రశంసిస్తున్నాం. ఆమెకున్న అంకితభావం గురించి కొనియాడుతున్నారు. అభిమానులు మాత్రం పూజాతో పని అట్లుంటది మరి అని కామెంట్లు పెడుతున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ‘మహేశ్ 28’ చిత్రంలో నటించనుంది. అలాగే హిందీలో సల్మాన్ ‘కిసీ కా భాయ్. కిసీ కా జాన్’ చిత్రంలో బిజీగా ఉంది.