టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా దాయాది పాకిస్థాన్‌తో పోరుకు భారత్ సిద్ధమవుతోంది. సూపర్-12లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు తలపడే ఈ మ్యాచ్‌లో ప్రపంచకప్‌కు ఊపురానుంది.
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో దారుణ పరాభవానికి గురైన భారత్ కసితో ఉంది.
పాకిస్థాన్‌ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని చూస్తున్న భారత్ జట్టు కూర్పుపై దృష్టి సారించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనర్లుగా దిగే చాన్స్ ఉంది.
రోహిత్ శర్మ కూడా ఫామ్‌లోకి వచ్చి బ్యాట్ ఝళిపిస్తే జట్టును అడ్డుకోవడం పాకిస్థాన్‌కు సాధ్యం కాదు. రోహిత్ బ్యాట్ నుంచి భారీ స్కోరు రాక చాలా రోజులైంది.
ఈ నేపథ్యంలో అతడు కనుక బ్యాట్‌కు పనిచెప్తే పరుగుల వరద పారడం ఖాయం. ఇప్పటి వరకు జరిగిన మూడు ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. కాబట్టి పాకిస్థాన్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో అయినా ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
రోహిత్, కేఎల్ రాహుల్ శుభారంభాన్ని అందిస్తే ఆ తర్వాత వచ్చే కోహ్లీ మిగతా పని కానిస్తాడు. ఆసియా కప్‌లో సెంచరీ సాధించి మూడేళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టిన కోహ్లీ ప్రపంచకప్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.