నేపాల్ లో భూకంపం సంభవించింది. నేపాల్ రాజధాని ఖాట్మండులో భూమి కంపించింది. భూకంప తీవ్రత 5.1గా రికార్డ్ స్కేల్ పై నమోదైంది. ఖాట్మండు నగరానికి తూర్పున 53 కిలోమీటర్ల దూరంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించిందని లైవ్ హిందుస్థాన్ వెల్లడించింది. అదేవిధంగా బీహార్లోని కొన్ని ప్రాంతాలలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. పాట్నాతో పాటు, పశ్చిమ చంపారన్ జిల్లాలో కూడా ప్రకంపనలు సంభవించాయి. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం నివేదించబడలేదు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంభవించిన భూకంపం ధాటికి భూమికి 10 కి.మీ మేర స్వల్ప ప్రకంపణలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఒక ట్వీట్లో తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ గత నెలలో మొత్తం 132 భూకంపాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. అందులో 35 భారత భూభాగంలో ఉండగా, మహారాష్ట్రలో అత్యధికంగా ఏడుసార్లు భూ ప్రకంపణలు జరిగినట్లు నమోదైంది.
మూలం: హిందూస్తాన్ టైమ్స్