మధ్యప్రదేశ్ ఇండోర్ విమానాశ్రయ సిబ్బంది ఫోటోల పేరిట వెంటపడటంతో.. వారిపై జయా
బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబానీ గ్రూపునకు చెందిన కోకిలాబెన్ ఆసుపత్రి
ప్రారంభోత్సవానికి బచ్చన్ దంపతులు ఇండోర్ విమానాశ్రయానికి చేరుకున్న క్రమంలో ఈ
ఘటన జరిగింది. జయా బచ్చన్ అసహనానికి లోనై.. సిబ్బంది తీరు పట్ల విస్మయం
చెందారు. ఇలాంటి సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించాలంటూ ఆగ్రహం వ్యక్తం
చేశారు. ప్రజలతో ఆమె మమేకమవుతుండగా, ఒక వ్యక్తి ఆమెను వారి ఫోన్లో రికార్డ్
చేయడం కనిపించింది. మరికొందరు కెమెరాలతో ఆమె చుట్టూ ఉన్నారు. వారితో మాట్లాడిన
జయ, “దయచేసి నా చిత్రాలను తీయవద్దు. మీకు ఇంగ్లీష్ అర్థం కాలేదా?” అని
ప్రశ్నించారు. దీంతో ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులు, సెక్యూరిటీ సిబ్బంది
ఛాయాచిత్రకారులను చిత్రాలను క్లిక్ చేయవద్దని కోరుతూ వారిని వెనక్కి నెట్టారు.
అభిమానులను కూడా పక్కకు వెళ్లి కెమెరాలు పెట్టమని చెప్పారు. అమితాబ్, జయ
లోపలికి వెళ్లినప్పుడు ఇద్దరికీ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అలా
నడుచుకుంటూ వెళ్తూనే జయ ఇలా అన్నారు. దీంతో అమితాబ్ కొద్దిసేపు జయ వైపు చూశారు.