సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ అనేది లేకుండా స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన
నటుడు కార్తిక్ ఆర్యన్. ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’, ‘లవ్ అజ్కల్ 2’ చిత్రాలతో
ప్రేక్షకులను అలరించాడు. ‘భూల్ భూలయ్యా 2’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్
హీరోగా మారిపోయాడు. అతడు తాజాగా నటించిన సినిమా ‘షెహజాదా’. అల్లు అర్జున్
ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురంలో’ కీ హిందీ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది.
కృతి సనన్ హీరోయిన్గా నటించింది. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ
ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్
ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ దాదాపుగా 3నిమిషాల పాటు కొనసాగింది. యాక్షన్ సీక్వెన్స్‌తో ట్రైలర్
ఓపెన్ అయింది. కుటుంబం విషయానికి వస్తే నో డిస్కషన్.. ఓన్లీ యాక్షన్ అనే
డైలాగ్స్ అలరించాయి. ట్రైలర్ లో రాజమౌళి పేరును కూడా వాడుకున్నారు. కార్తిక్
ఆర్యన్ గతంలో ఎన్నడూ కనిపించని పాత్రను ఈ చిత్రంలో పోషించాడు. కార్తిక్ ఆర్యన్
తల్లిగా మనీషా కొయిరాలా కనిపించింది. ఈ చిత్రంలో రోనిత్ రాయ్, పరేశ్ రావల్,
రాజ్ పాల్ యాదవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.