యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో
నటించి ప్యాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్
ఆర్‌లో కొమరం భీమ్ పాత్రలో ఒదిగిపోయి.. తన నటనతో మైమరిపించారు. ఈ సినిమా
ఇండియాలోనే కాకుండా నెట్‌ఫ్లిక్స్ పుణ్యమా అని.. ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో
గుర్తింపును తెచ్చుకుంటోంది. ఈ చిత్రం మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ప్రస్తుతం ఆస్కార్ రేసులో
హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది. అంతేకాదు ఈ సినిమాలో భీమ్ పాత్రలో నటించిన
ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో ఉన్నట్లు తెలిపింది ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్
వెరైటీ.. ఎన్టీఆర్ ఉత్తమ నటుడుగా, రాజమౌళి ఉత్తమ దర్శకుడు కేటగిరీల్లో
ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశం ఉందని పేర్కోంది. ఈ క్రమంలో ఉత్తమ నటుడి
జాబితాలో విల్ స్మిత్, హ్యూ జాక్మన్ వంటి నటులతో పోటీ పడుతూ ఈ టాప్ 10
జాబితాలో ఎన్టీఆర్ చోటు దక్కించుకోవడం మామూలు విషయం కాదని అంటున్నారు
విశ్లేషకులు. అంతేకాదు ఓ భారతీయ నటుడు ఇక్కడి దాకా రావడం కూడా ఇదే మొదటిసారని
అంటున్నారు. దీంతో తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం
చేశారు.
టాప్ టెన్ సినిమాల జాబితాలో “బాబిలోన్,” “నోప్,” “గ్లాస్ ఆనియన్: ఎ
నైవ్స్ అవుట్ మిస్టరీ” “బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్”), విదేశీ భాషా
చలనచిత్రాలు,ఆర్.ఆర్.ఆర్, “ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” తదితర
చిత్రాలు ఉన్నాయి. 2023 ఆస్కార్‌కు ఉత్తమ చిత్రం నామినేషన్లను జనవరి 24న
ప్రకటించనున్నారు.