ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన భారీ సినిమా ‘పుష్ప:
ది రైజ్’ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో హవా నడిపిస్తోంది. తొలుత డివైడ్ టాక్
వచ్చినా వసూళ్ల పరంగా భేష్ అనిపించుకుంటోంది. వసూళ్ల వేటలో టాప్ గేరేసి
దూసుకుపోతున్నారు లారీ డ్రైవర్ పుష్పరాజ్. ఈ పాత్రలో అల్లు అర్జున్ నటనపై
సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుండగా.. నిర్మాతలకు కాసుల పంట పండుతోంది. ఈ
నేపథ్యంలోనే ఓవర్సీస్ కలెక్షన్స్ పరంగా రేర్ ఫీట్ సాధించి సరికొత్త రికార్డు
నెలకొల్పారు అల్లు అర్జున్.
గత నెలలో రష్యాలో విడుదలైన సుకుమార్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ 10
మిలియన్ రూబిళ్లు అంటే దాదాపు 12 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అల్లు
అర్జున్-నటించిన ఈ చిత్రం డిసెంబర్ 8న రష్యన్ భాషలో గ్రాండ్ గా విడుదలైన విషయం
తెలిసిందే. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్లలో ప్రదర్శనల తర్వాత, ఈ చిత్రం 774
స్క్రీన్లలో విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటి వరకు స్క్రీన్ల సంఖ్య తగ్గలేదు
అని మూవీ మేకర్స్ తెలిపారు. ‘పుష్ప: ది రైజ్’ విడుదలైన మూడవ వారంలో, రష్యాలో
అత్యధికంగా ఇష్టపడే భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి
సంబంధించిన రష్యన్ శాటిలైట్ హక్కులు త్వరలో మరో రూ. 2 కోట్లకు అమ్ముడవుతాయని
యూనిట్ వర్గాలు తెలిపాయి.