ప్రముఖ గాయని, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత సులోచన చవాన్ మృతి చెందారు. 90 ఏళ్ల
సులోచన వయోభారంతో శనివారం కన్నుమూశారు. వయస్సు రీత్యా సమస్యలతో కొద్ది
రోజులుగా ఇబ్బంది పడుతున్న ఆమె.. మహారాష్ట్రలోని తన ఇంట్లో చివరి శ్వాస
విడిచారు. దక్షిణ ముంబైలోని తన ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆమె
కుమారుడు, ధోల్కీ ప్లేయర్ విజయ్ చవాన్ తెలిపారు. కాగా, 1993 మార్చ్ 13న
ముంబాయిలో సులోచన జన్మించారు. శనివారం సాయంత్రం దక్షిణ ముంబయిలోని మెరైన్
లైన్స్ లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. సులోచన చవాన్ లావణి అని పిలువబడే ఆమె
సాంప్రదాయ మహారాష్ట్ర సంగీతానికి పురాణ ప్రదర్శకురాలు. ఈ రంగానికి ఆమె చేసిన
కృషికి గాను ఆమెకు “లావణి సామ్రాజ్ఞి” (లావణి రాణి) బిరుదు లభించింది. లావణి
జానపద థియేటర్ రూపంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంది.