ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ మొదట అనుకున్నట్టుగా డిసెంబర్ రెండవ
వారం నుండి జరగటం లేదని సినీ వర్గాలు వెల్లడించాయి. మహేష్ బాబు ఇంట ఇటీవల
జరిగిన పరిణామాల నేపథ్యంలో సినిమాకు బ్రేక్ లు పడుతూనే ఉన్నాయి. నిజానికి ఈ
సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సన్నివేశంతో మొదలు పెట్టినా కేవలం ఆరు రోజులు
మాత్రమే చేశారు. తరువాత మహేష్ బాబు కి ఆ యాక్షన్ దర్శకులకి డేట్స్ సరిగ్గా
కుదరలేదని మహేష్ షూటింగ్ చెయ్యలేదని ఒక వార్త అప్పట్లో నడిచింది. అంతే ఆ ఆరు
రోజులు మాత్రమే షూటింగ్ అయింది ఇంతవరకు. ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది సినిమా
మళ్ళీ ఫ్రెష్ గా మొదలెట్టాలి అని, ఇక ఎప్పటికి పూర్తి అవుతుందో అని దర్శకుడు
త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశీ చాల ఆందోళనలో వున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు
షూటింగ్ ఏకంగా సంక్రాంతి తరువాత పెట్టుకుందాం అని మహేష్, త్రివిక్రమ్ డిసైడ్
అయ్యారని టాక్ నడుస్తోంది. అంటే జనవరి మూడో వారం లో షూటుంగ్ మొదలయ్యే అవకాశాలు
కనిపిస్తున్నాయి.