తెలుగు చలన చిత్రసీమ దిగ్గజం, సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని అటు ఘట్టమనేని
ఫ్యామిలీతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భౌతికంగా అయన దూరమయినా
కృష్ణ జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ తలుచుకుంటూనే ఉన్నారు. ఇక ఇంట్లో వరుస
విషాదాలతో ప్రిన్స్ మహేష్ బాబు కూడా పూర్తిగా కుంగిపోయారు. ఏడాది
ప్రారంభంలోనే సోదరుడిని, రెండు నెలల క్రితం తల్లి ఇందిరా దేవిని, ఇప్పుడు
తండ్రి కృష్ణను కోల్పోవడంతో మహేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆదివారం
హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ దగ్గర కృష్ణ దశ దిన కర్మను ఘట్టమనేని కుటుంబ
సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులుతోపాటు.. అభిమానులు
పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి
గురయ్యారు. ” నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో గొప్పది.. మీ అభిమానం..
అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ
గుండెల్లోనూ ఉంటారు. ఆయన ఎప్పుడూ మనమధ్యే ఉంటారు. మీ అభిమానం, ఆశీస్సులు
ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్. ఇక కృష్ణ
మరణం అనంతరం సోషల్ మీడియాలో మహేష్ చేసిన పోస్ట్ అందరి హృదయాలను కదిలించింది.