బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి తబస్సుమ్ గోవిల్ (78) కన్నుమూశారు. గుండెపోటు
కారణంగా శుక్రవారం (నవంబర్18) రాత్రి ఆమె మరణించినప్పటికీ అందుకు సంబంధించిన
సమాచారం మాత్రం శనివారం (నవంబర్19) వెలుగులోకి వచ్చింది. తబస్సుమ్ మరణాన్ని
ఆమె కుమారుడు హోషాంగ్ గోవిల్ మీడియాకు తెలియజేశాడు ‘కొన్ని రోజుల క్రితం
అమ్మను ఆస్పత్రిలో చేర్పించాం. ఆమెకు గ్యాస్ట్రో సమస్యలు ఉన్నాయి. చికిత్స
తీసుకుంటుండగానే ఉదయం 8:40 గంటలకు మొదటి సారి గుండెపోటు వచ్చిందని, 8:42
గంటలకు రెండోసారి గుండెపోటు వచ్చిన సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం
గురించి ఎవరికీ చెప్పకూడదని అమ్మ నాతో చెప్పింది. అందుకే దీని గురించి
మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చాడు. కాగా బాలీవుడ్ లో
చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది తబస్సుమ్. దూరదర్శన్‌లో
ప్రసారమైన టాక్ షో ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్‌తో మంచి గుర్తింపు
తెచ్చుకుంది. 1940ల చివరలో నర్గీస్, మేరా సుహాగ్, మంఝ్ధార్, బారీ బెహెన్
తదితర చిత్రాలలో నటించి మెప్పించింది తబస్సుమ్ .1972 నుండి 1993 మధ్యకాలంలో
దూరదర్శన్‌లో పలు సెలబ్రిటీ టాక్ షోలను నిర్వహించింది. రేడియో ప్రెజెంటర్‌గా
కూడా పనిచేసింది. ఇక తబస్సుమ్ రామాయణంలో రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్
సోదరుడు విజయ్ గోవిల్‌ను వివాహం చేసుకున్నారు.1990లో వచ్చిన స్వర్గ్ తబస్సుమ్
చివరి సినిమా. జీటీవీలో 2009లో ప్రసారమైన లేడీస్ స్పెషల్ టీవీ షోలో ఆమె
చివరిగా న్యాయనిర్ణేతగా కనిపించింది. తబస్సుమ్ మృతితో బాలీవుడ్ చిత్రసీమలో
విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి
వ్యక్తం చేస్తున్నారు.