2016లో తన పాక్ పౌరసత్వాన్ని వదులుకుని భారత పౌరసత్వాన్ని స్వీకరించిన గాయకుడు
అద్నాన్ సమీ, ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా చేసిన ఓ ప్రకటన ఆసక్తి రేపుతోంది. ఆ
ప్రకటనలో.అతను పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాడు. తన
ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పాకిస్తాన్ తనకు ఏమి చేసిందో “వాస్తవాన్ని
వెల్లడిస్తానని” అతను రాశాడు. అదనాన్ సమీ తెలిపిన ప్రకారం… “పాకిస్తాన్‌ను
ఎందుకు అంత చిన్నచూపు చూస్తున్నారు అని చాలా మంది నన్ను అడిగారు. కఠినమైన
వాస్తవం ఏమిటంటే, నా పట్ల దయ చూపిన పాకిస్థానీయుల పట్ల నేను ఎలాంటి
దురుద్దేశాన్ని కలిగి ఉండను. నన్ను ప్రేమించే వారు నాచేత ప్రేమించబడతారు” అంటూ
పోస్ట్ చేశారు.

తాను భారతదేశంలోని ముంబైలో నివాసముంటు న్నందుకు గర్వపడుతున్నానని తెలిపాడు.
‘16ఏళ్లుగా భారత్ నాకు అందమైన ఇల్లు. ఈ దేశంలోని ప్రతి ఒక్కరి నుంచి
చెప్పలేనంత ప్రేమను పొందా. నేను ఈ దేశాన్ని, ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్నా.
నాకు వేరే దేశస్థుడిననే భావన ఎప్పుడూ కలగలేదు. నేనెప్పుడూ భారత దేశానికి
కృతజ్ఞున్ని’అని పేర్కొన్నారు. కాగా, ఇటీవలే విడుదలై విజయవంతంగా
ప్రదర్శింపబడుతున్న బాలీవుడ్ చిత్రం ‘భజరంగీ భాయిజాన్’లో సమీ ప్రత్యేక పాత్రలో
కనిపించారు. చిత్రంలో ‘భర్ దే జోలి మేరి యా మొహమ్మద్’ అనే పాట పాడారు.