సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల మంత్రి వేముల సంతాపం
హైదరాబాద్ : పద్మభూషణ్, మాజీ ఎం.పీ, సూపర్ స్టార్ డాక్టర్.కృష్ణ మృతి పట్ల
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం
వ్యక్తం చేశారు. కృష్ణ గారి మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్నారు. 350
పైగా సినిమాల్లో నటించడమే గాక, తెలుగు సినిమా రంగంలో ఆయన తీసుకు వచ్చిన
మార్పులు మరువలేనివన్నారు.కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.ఆయన కుటుంబ
సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ణ లాంటి సీనియర్ నటుడ్ని కోల్పోవడం చిత్ర పరిశ్రమకు తీరని
లోటు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్ : ప్రముఖ చలనచిత్ర నటుడు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణం పట్ల
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. కృష్ణ మృతి వార్త
బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కుటుంబసభ్యులకుప్రగాఢ
సానుభూతిని తెలియజేశారు. మహేష్ బాబు, నరేష్ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని
ప్రసాదించాలని కోరుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో కృష్ణ ఓ ట్రెండ్ సెట్టర్
ఆని, సంచలన సినిమాలు చేయాలన్నా.. సాహస సినిమాలు తీయాలన్నా.. సూపర్ స్టార్
తర్వాతే ఎవరైనా. నటుడిగా మొదలైన తన సినీ జీవితంలో.. దర్శకుడిగా, మారి ఎన్నో
అద్భుత చిత్రాలను తెరకెక్కించారని,. నిర్మాతగా మారి ఎన్నో మరుపురాని చిత్రాలకు
ప్రాణం పోశారని పేర్కొన్నారు. కృష్ణ లాంటి సీనియర్ నటుడ్ని కోల్పోవడం తెలుగు
చిత్ర పరిశ్రమకు తీరని నష్టమన్నారు. విభిన్న పాత్రలలో సూపర్ స్టార్ కృష్ణ
ప్రేక్షకులను ఆకట్టుకున్నారని, లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారని
మంత్రి అభిప్రాయపడ్డారు.
ఘట్టమనేని కృష్ణ మృతిపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి సంతాప సందేశం
హైదరాబాద్ : తెలుగు వెండితెర ‘కౌబాయ్’, సూపర్ స్టార్ కృష్ణ శ్రీ ఘట్టమనేని
కృష్ణ పరమపదించారని తెలిసి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల
అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐదున్నర
దశాబ్దాలపాటు టాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన
స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ గారి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు.
తెలుగు సినిమాతెరపై ‘జేమ్స్ బాండ్’ జోనర్ ను పరిచయంచేసి, తెలుగు సినీ
చరిత్రలో సాంకేతికకు సంబంధించి ఎన్నో ప్రయోగాలు చేసి.. తెలుగు చిత్రపరిశ్రమ
‘సింహాసనం’ను అధిష్టించారు. కష్టపడి పనిచేస్తే విజయం తథ్యమన్న
సందేశాన్నిస్తూ 24 గంటలు పనిచేయడం, ఏడాదికి 10 సినిమాలు చేయడాన్ని లక్ష్యంగా
పెట్టుకుని దాన్ని పూర్తి చేసేలా శ్రమించేవారు. రికార్డు స్థాయిలో 2500పైగా
అభిమాన సంఘాలుండటం కృష్ణ నటనపై ప్రజల్లో ఉన్న అభిమానానికి, గౌరవానికి
నిదర్శనం. దేశభక్తి చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, సమాజాన్ని జాగృతం చేసే
సినిమాలు, యువత, కార్మికులు, కర్షకులు, ఇలా ప్రతి రంగాన్ని ప్రోత్సహించేలా,
స్ఫూర్తినింపేలా వారు తీసిన చిత్రాలకు లభించిన ఆదరణ మనందరికీ తెలిసిందే.
ఇటీవల రంపా ఉద్యమ శతాబ్ది సందర్భంగా అల్లూరి సీతారామరాజు నడయాడిన
ప్రాంతాల్లో పర్యటించిన సమయంలోనూ శ్రీ కృష్ణని గుర్తుచేసుకున్నాము. తెలుగు
ప్రజల గుండెల్లో అల్లూరిని ఆరాధ్య దైవంగా నిలిపిన ఘనత కృష్ణ కే చెందుతుంది.
టాలీవుడ్ స్థాయిని పెంచిన సూపర్ స్టార్ గారు మన మధ్యన లేకపోవడం విచారకరం.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు,
అశేష అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కేంద్ర పర్యాటక,
సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
నమ్మిన ఆదర్శాలకు జీవితాంతం కట్టుబడ్డ హీరో – సాహసానికే ఊపిరి ఘట్టమనేని కృష్ణ
– కంభంపాటి రామమోహన్ రావు
హైదరాబాద్ : సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది.
సినీ పరిశ్రమలో ఆయనలేని లోటు పూడ్చలేనిది. నటనలో, వ్యక్తిత్వంలో ఆయనకు ఆయనే
సాటి. తెలుగులో తొలి పూర్తి నిడివి కలర్, సినిమాస్కోప్, 70ఎంఎం సినిమాల
స్రష్ట. నమ్మిన ఆదర్మాలకు జీవితాంతం కట్టుబడ్డ వ్యక్తి.
వందలాది సినిమాలతో లక్షలాది సినీ కార్మికులకు ఉపాధి కల్పించిన ధన్యజీవి.
నటుడిగా, సినీ నిర్మాతగా, స్టూడియో అధినేతగా కృష్ణ అధిరోహించని ‘‘సింహాసనం’’
లేదు. ఆయన కుటుంబ సభ్యులకు, కృష్ణగారి అభిమానులకు ప్రగాఢ సంతాపం
తెలియజేస్తున్నానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
కంభంపాటి రామమోహన్ రావు పేర్కొన్నారు.
సినీ గగన నీలాకాశంలో ఆయన సూపర్ స్టార్ – మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్ : సినీ గగన నీలాకాశంలో ఆయన సూపర్ స్టార్ అని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. సినీ నటుడు కృష్ణ మృతి పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. సినీ జగత్తులో సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచిన కృష్ణ డేరింగ్, డాషింగ్ అనన్య సామాన్య మైనదని ఆయన కొనియాడారు. అటువంటి హీరో నేడు మన మధ్య లేక పోవడం తీరని లోటుగా ఆయన చెప్పారు. సినిమా ను స్కోప్ లో తీయలన్నా 70 యం యం స్టీరియోస్కోపిక్ తో తియ్యలన్నా ఆయనకే చెల్లు బాటు అయిందన్నారు. మొట్టమొదటి ఈస్ట్ మాన్ కలర్ సినిమాతో సినీ ప్రపంచంలో సంచలనాలు మొదలు పెట్టిన ఆయన స్కోప్, స్టీరియోస్కోపిక్,70 యం యం వంటి అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న నటశేఖరుడు సినీ పరిశ్రమ కు ఒక వేగు చుక్క లాంటి వారన్నారు. జేమ్స్ బాండ్ తో రాణించి అల్లూరి సీతారామ రాజు డైలాగులతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న కృష్ణ కొత్త కాపురం వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళాభిననుల మనసులో చిరస్మరణీయంగా నిలిచి పోయారన్నారు. అటువంటి మహా నటుడి మరణం తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పటికీ లోటుగానే ఉంటుందన్నారు. అటువంటి మహానటుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
కృష్ణ మృతి తీరని లోటు : మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : సూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపాన్ని వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ..చిన్నతనం నుంచీ కృష్న నటించిన ఎన్నో సిమాలు చూస్తూ పెరిగామన్నారు. సామాజిక, రాజకీయ చైతన్యవంతమైన సినిమాలు ఎన్నో కృష్ణ తీశారని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తంచేస్తూ వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపా