దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం.
సామాన్యుల మాదిరిగానే బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ రోజును తమ ప్రియమైన వారితో
జరుపుకుంటున్నారు.
హిందీ చిత్ర పరిశ్రమ గురించి మాట్లాదాల్సి వస్తే..1980,90 లలో అనేక మంది
ప్రముఖ బాలనటులు ఉన్నారు. వారు తమ చిత్రాల్లో శక్తివంతమైన ప్రదర్శనలతో
అభిమానులను ఇంకా ఆకట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో బాలల దినోత్సవం 2022 సందర్భంగా, బాల నటులుగా తమ కెరీర్
ప్రారంభించి.. ఉన్నత స్థాయికి ఎదిగి.. కొనసాగుతున్నపరిశ్రమలోని ప్రముఖ నటులను
గురించి తెలుసుకుందాం.
అలియా భట్..
ప్రీతి జింటా, అక్షయ్ కుమార్ నటించిన ‘సంఘర్ష్’ (1999)లో అలియా భట్ తొలిసారిగా
నటించింది.
ఈ సినిమాలో ప్రీతి అనే యువతి పాత్రలో ఆమె నటించింది.
ఇప్పుడు, ఆమె బాలీవుడ్ లో స్థిరపడిన ప్రముఖ నటుల్లో ఒకరుగా తనను తాను
నిరూపించుకుంది.
గంగూబాయి కతియావాడి, ఉడ్తా పంజాబ్, రాజీ, బ్రహ్మాస్త్ర తదితర పలు చిత్రాల్లో
ఆమె నటించింది.
షాహిద్ కపూర్..
2003లో ‘ఇష్క్ విష్క్’ సినిమాతో షాహిద్ కపూర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
అయితే కాంప్లాన్ బాయ్ గా అతను కాంప్లాన్ పాపులర్ యాడ్ లో కనిపించిన సంగతి చాలా
మందికి తెలియదు.
ఆయేషా టకియా కూడా తన యాడ్లో నటించింది. ఇప్పుడు బాలీవుడ్లో పలు చిత్రాల్లో
నటించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
హృతిక్ రోషన్ ..
రజినీకాంత్ నటించిన భగవాన్ దాదా చిత్రంలో హృతిక్ రోషన్ చిన్నతనంలో గోవిందా
పాత్రలో నటించాడు.
ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు, అతను పరిశ్రమలో ఒక
స్థిరపడిన నటుడు. కోయి మిల్ గయా, క్రిష్, ధూం 2, జోధా అక్బర్ వంటి చిత్రాలతో
అనేక హృదయాలను గెలుచుకున్నాడు.
ఊర్మిళ ..
రంగీలా, దౌడ్, కౌన్, భూత్ తదితర చిత్రాల్లో ఊర్మిళ నటనకు ప్రేక్షకులు ఫిదా
అయ్యారు.
అయితే మొదటగా ‘కారం’ సినిమాలో బాలనటిగా కనిపించిన ఈ భామ గురించి తెలుసా?
ఆ తర్వాత మసూం, కలియుగ్, దకైట్ వంటి ప్రముఖ చిత్రాల్లో బాలనటిగా నటించింది.
అమీర్ ఖాన్..
‘గజిని’, ‘ధూం 3, 3 ఇడియట్స్’.. . ఇలా ఎన్నో సినిమాల్లో అమీర్ ఖాన్ నటించారు.
అయితే 1973లో వచ్చిన యాదోన్ కీ బారాత్ చిత్రంలో బాలనటుడిగా నటించిన విషయం
చాలామందికి తెలియదు.
హన్సిక మోత్వాని..
షక లక బూం బూం, డెస్ మేన్ నికల్లా హోగా చంద్ వంటి టీవీ షోలలో ఆమె చేసిన
పాపులర్ ప్రదర్శనల కారణంగా 90లలో చాలామంది పిల్లలు ఇప్పటికీ హన్సిక
మోత్వానిని గుర్తుంచుకుంటారు.
కోయి మిల్ గయా, హవా, తదితర చిత్రాల్లో ఆమె నటించింది.
మూలం: టైమ్స్ నౌ