బాలీవుడ్లో దీపికా పదుకొణే 2007లో కెరీర్ ప్రారంభించిన ఆమె తనకంటూ ఓ
ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ ఆమె పలు
సినిమాల్లో నటించింది. బి టౌన్ లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న
నటీనటుల్లో దీపికా కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటిగా తన
సత్తా చాటింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్గా మెప్పించిన ఆమె.. తాజాగా వ్యాపార
రంగంలోకి అడుగు పెట్టింది. ఫిలిం ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న
ఆనందంలో దీపికా పదుకొణె తన సొంత బ్రాండ్‌ను లాంచ్ చేసింది. 82 ఈస్ట్ అనే
పేరుతో సెల్ఫ్ కేర్ బ్రాండ్‌ను ప్రకటించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్
దీన్ని ప్రమోట్ చేస్తూ ఆమె వీడియో విడుదల చేసింది. ‘రెండేళ్ల క్రితమే సెల్ఫ్
కేర్ బ్రాండ్‌ను ప్రారంభించాలని అనుకున్నాం. ప్రస్తుతం దీన్ని మన దేశంలోనే
లాంచ్ చేశాం. ఇక త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దీన్ని పరిచయం చేస్తాం. ఇదే మా 82
ఈస్ట్’ అంటూ రాసుకొచ్చింది.