బాలీవుడ్ నటులు బిపాసా బసు-కరణ్ సింగ్ గ్రోవర్ తల్లిదండ్రులయ్యారు. శనివారం
పండంటి ఆడబిడ్డకు బిపాసా జన్మనిచ్చింది. దీంతో వీరు ఆ మధుర క్షణాలను
ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ బేబీ గర్ల్ పుట్టిన సంతోషంలో
తేలియాడుతున్నారు. 2016లో కరణ్‌ను పెళ్లి చేసుకున్న బిపాసా.. ఆరేళ్ల తర్వాత
తల్లయింది. తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నట్లు కొన్ని నెలల క్రితమే
ప్రకటించిన ఈ జంట.. తాజాగా బిడ్డ పుట్టడంతో ఆ మధురు క్షణాలను
ఆస్వాదిస్తున్నారు. ఈ తరుణంలో ఈ జంటకు సినీ వర్గాలు శుభాకాంక్షలు
తెలుపుతున్నాయి. సోనమ్ కపూర్, షమితా శెట్టి, దియా మీర్జా, తదితర ప్రముఖులు
వారికి శుభాకాంక్షలు తెలిపారు. “బిపాసా, మీ కోసం నేను నిజంగా సంతోషంగా
ఉన్నాను.” అంటూ సోనమ్ కపూర్ పోస్ట్ చేశారు.