హాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో బ్రాడ్ పిట్ తో జెన్నిఫర్ అనిస్టన్ బ్రేకప్
వ్యవహారంలోను బోలెడన్ని కలతలు బయటపడుతున్నాయి. ఇక బ్రాడ్ కి తన బిడ్డను
ఇవ్వలేనని జెన్నిఫర్ కోర్టుల పరిధిలో వాదిస్తోంది. అంతేకాదు.. జెన్నిఫర్
అనిస్టన్ ఐవీఎఫ్ విధానంలో పిల్లవాడిని కన్నది. అందుకే తన బిడ్డను ఇచ్చే
ప్రసక్తి లేదని ఆమె కోర్టు ఎదుట వాదించింది. ఈ తరుణంలో ప్రముఖ టెలివిజన్
షో ‘ఫ్రెండ్స్’ తర్వాత హాలీవుడ్ నటి జెన్నిఫర్ నిరంతరం వార్తా కథనాల్లో
నిలిచింది. తన గర్భధారణ పుకార్లు, రకరకాల ఊహాగానాలు తనను కలవరపెట్టలేదని, తాను
ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా ఉన్నానని జెన్నిఫర్ అనిస్టన్ తెలిపింది.
జెన్నిఫర్ ఎట్టకేలకు బ్రాడ్ పిట్ -జస్టిన్ థెరౌక్స్ లతో తన మునుపటి రెండు
వివాహాల గురించి మౌనం వీడింది. వాస్తవానికి వివాహానంతరం తనకు పిల్లలు
పుట్టలేదు. నేను గర్భవతిని అయ్యేందుకు చాలా ప్రయత్నించానని తెలిపింది.
చివరకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా బిడ్డను కన్నట్లు
తెలిపింది. ప్రఖ్యాత అల్లూర్ మ్యాగజైన్ తో ఒక ప్రత్యేక సంభాషణలో జెన్నిఫర్
ఇలా వ్యాఖ్యలు చేసింది. తన బిడ్డను బ్రాడ్ పిట్‌కు ఇచ్చేది లేదని ఆమె
స్పష్టం చేసింది.