హాలీవుడ్ సీనియర్ నటి జెన్నిఫర్ అనిస్టన్ తన సంతానోత్పత్తి సమస్యపై
పలు విషయాలు వెల్లడించారు. ఇటీవల అల్లూర్ మ్యాగజైన్ ముఖచిత్రంపై కనిపించిన
ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. తన వంధ్యత్వ పోరాటాల గురించి అనేక
దిగ్భ్రాంతికరమైన వివరాలు వెల్లడించింది, తన 40 ఏళ్ల వయసులో కూడా ఇన్ విట్రో
ఫెర్టిలైజేషన్ ద్వారా గర్భం దాల్చడంలో ఇబ్బంది పడినట్లు చెప్పింది. ఇదే
సందర్భంలో తన మునుపటి సంబంధాల సన్నిహిత వివరాలను కూడా పంచుకుంది. “నేను
గర్భవతి కావడానికి అనుకున్నదంతా చేశాను. చైనీస్ టీలు తీసుకుంటున్నా. ఇన్
విట్రో ఫెర్టిలైజేషన్ చేయించుకున్నా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను”
అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది.