బాలీవుడ్లో మరో జంట పెళ్లి పీటలెక్కబోతుంది. ఇటీవలే ఆలియా, రణ్ బీర్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరి బాటలోనే…కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కూడా పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయమై కియారా.. కాఫీ విత్ కరణ్ షోలో క్లారిటీ ఇచ్చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీళ్ళు డేటింగ్ కూడా చేస్తున్నారు. షేర్షా సినిమాలో వీరిద్దరూ కలిసి తొలిసారిగా నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తాజాగా ఈ జంట తమ వివాహాన్ని ఎప్పుడు చేసుకోవాలనే తేదీపై కూడా క్లారిటీ వచ్చేసినట్లు సమాచారం. చండీగఢ్ వెడ్డింగ్ లొకేషన్స్ కూడా చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిద్ధార్థ్, కియారా తమ
పెళ్లి లొకేషన్ల కోసం నెల రోజులకు పైగా వెతుకుతున్నారు. దంపతులు ఖరీదైన వివాహ స్టలం కోసం సెర్చ్ చేస్తున్నారని బాలీవుడ్ లో టాక్. ఇదిలా ఉండగా, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో కూడా ఎందరో హీరోలతో కలిసి నటించింది. ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో మెప్పించింది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.