దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ ఎన్టీఆర్ సరసన జోడీ కట్టి టాలీవుడ్ లోకి
ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.ఇప్పుడు మరో కుమార్తె ఖుషి కపూర్ కూడా నటనపై
ఆసక్తితో ఒకట్రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు పెద్దగా
ఆడలేదు. కాకపోతే శ్రీదేవి కుమార్తె అనే క్రేజ్ ఉంది కదా అందుకే ఆమెకి మంచి
అవకాశాల వస్తున్నాయి. తాజాగా తమిళ చిత్రసీమ నుంచి ఖుషికి కబురొచ్చింది. అధర్వ
కథానాయకుడిగా ఆకాశ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. అనిరుథ్
సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా ఖుషిని తీసుకొన్నారని టాక్.
తెలుగు నుంచి కూడా ఖుషికి అవకాశాలు వస్తున్నాయని సమాచారం. అయితే.. ‘బడా హీరో
సినిమా, లేదంటే క్రేజీ ప్రాజెక్ట్ అయితేనే చేస్తాను” అంటోందట. ఖుషికి
ఇప్పటికిప్పుడు స్టార్ హీరోలు అవకాశం ఇవ్వరు కానీ, చిన్న సినిమా చేసి,
నిరూపించుకొంటే మాత్రం కచ్చితంగా స్టార్ హీరోల దృష్టి తనపై పడుతుంది. మరి ఖుషి
టాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.