తెలుగులో వరుస అవకాశాలతో జోరు ప్రదర్శిస్తోంది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఆమె
మహేశ్ బాబు- త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’లో ఓ నాయికగా
నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు వరుణ్ తేజ్ కు జోడీగా ‘మట్కా’లోనూ,
విష్వక్ సేన్ సరసన మరో కొత్త చిత్రంలోనూ కనిపించనుంది. అయితే ఇప్పుడీ కథానాయిక
ఖాతాలో మరో పాన్ ఇండియా సినిమా వచ్చి చేరినట్లు తెలుస్తోంది. అదే దుల్కర్
సల్మాన్ వెంకీ అట్లూరి కలయికలో రూపొందనున్న ‘లక్కీ భాస్కర్’ అని సమాచారం.
నిజానికి ఈ సినిమా కోసం నాయికగా తొలుత సాక్షి వైద్య పేరు బలంగా వినిపించినా..
ఆఖరికి చిత్ర బృందం మీనాక్షిని ఖాయం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే కదా చర్చలు
పూర్తయ్యాయని.. సినిమా చేసేందుకు ఆమె అంగీకారం తెలిపిందని టాక్. త్వరలో
చిత్రీకరణ మొదలుకానుంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా
వ్యవహరిస్తున్నారు.