హీరోయిన్ అంటే హీరో వెంటపడటం, పాటల్లో నాలుగైదు మూస స్టెప్పులు వేయడం.. అనే
అభిప్రాయాన్ని అప్పట్లో బద్ధలు కొట్టాను కష్టమైన నృత్యాలు చేస్తూ కొత్త
ట్రెండ్ సృష్టించాను’ అంటోంది సీనియర్ నటి రవీనా టాండన్. తాజాగా ఒక టీవీ
ఛానెల్ లో మాట్లాడుతూ ఆనాటి కథానాయికల పరిస్థితులు, వాటిని తనకు అనుకూలంగా
ఎలా మలచుకుందో. వివరించింది. “అక్స్” చిత్రంలోని ‘యే రాత్.. పాట అప్పట్లో
పెద్ద సంచలనం. దానికోసం నేను చాలా కష్టపడ్డాను. ఆ పాటకి రాజు సుందరం మాస్టారు
నృత్య దర్శకుడు. ఆ సాంగ్ లో నేను ఒక కుర్చీ చుట్టూ తిరుగుతూ వేసే స్టెప్పుని
ఎంత ప్రయత్నించినా సరిగా రాలేదు. రాజుసుందరం మాస్టర్ పర్ఫెక్షన్ కోసం తపించే
వ్యక్తి. స్టెప్పులు సరిగా రావడం లేదని ఎంతకూ ఓకే చెప్పలేదు. రాత్రి ఏడింటికి
ముగుస్తుందనుకున్న చిత్రీకరణ కాస్తా.. తెల్లవారుజామున 5 గంటల దాకా కొనసాగింది.
‘నువ్వు చేసి తీరాల్సిందే అనేవారాయన. అలాంటి కొరియోగ్రాఫర్ ల వల్లనే మేం కొత్త
ట్రెండ్ సృష్టించగలిగాం’ అంటూ ఆనాటి సంగతుల్ని గుర్తుచేసుకుంది రవీనా.
ప్రస్తుతం ‘ఘుడ్డీ’, ‘వెల్కమ్ టు ది జంగిల్ అనే చిత్రాల్లో నటిస్తోందా.