వెంకటేష్ కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా
తెరకెక్కుతున్న సినిమా ‘సైందవ్’. వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ శ్రీలంకలో జరుగుతోందని
తెలిసింది. ఈ షెడ్యూల్ లో బ్యాలెన్స్ టాకీ పార్ట్, ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్
లతో పాటు ఒక పాట కోసం కొన్ని మాంటేజ్ సీన్స్ షూట్ చేయనున్నారు. వెంకటేష్ తో
పాటు కీలక పాత్రధారులంతా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇందులో వెంకటేష్
ఫెరోషియస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్
సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ,
ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు, ఆర్య కీలక పాత్రలో
కనిపించనున్నాడు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
డిసెంబర్ 2న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్
కానుంది.