‘జైలర్’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర నటుడు రజనీకాంత్,
ఆయన తదుపరి చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించబోతున్న
విషయం తెలిసిందే. ఈ నెల 19న సెట్స్ మీదకు వెళ్లనుంది. వాణిజ్య హంగులు, కలబోసిన
సామాజిక కథాంశంతో తెరకెక్కిందబోతుందని సమాచారం. ఇందులో రజనీకాంత్ పోలీస్
అధికారి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇదిలావుండగా ఈ సినిమాలో
తెలుగు యువ హీరోలు నాని లేదా శర్వానంద్ కీలక పాత్రలో నటించనున్నారని
వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం వారిద్దరి స్థానంలో ఈ అవకాశాన్ని రానా
దక్కించుకున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ లో రానా
పాల్గొనబోతున్నాడని సమాచారం. అయితే ఆయన పాత్ర ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
రజనీకాంత్ 170 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని లైకా
ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది.