ఒకప్పటి హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్, టాప్ మోడల్ ఎమిలీ రతాజ్కోవ్స్కీ డేటింగ్ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమిలీ రతాజ్కోవ్స్కీ గురించి బ్రాడ్ పిట్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని ఇచ్చాయి. “ఆమె చాలా అందంగా ఉంది. కళలో కూడా చాలా మంచిది. మాట్లాడటానికి చాలా ఉన్నాయి” అంటూ బ్రాడ్ పిట్ పేర్కొన్నారు. అయితే వీటన్నింటి మధ్య మోడల్ మాట్లాడుతూ… తాను భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉన్నానన్నారు.