పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కొత్త
షెడ్యూల్ గురువారం హైదరాబాద్ లో మొదలైంది. ఈ షెడ్యూల్లో భారీ పోరాటఘట్టాలను
తెరకెక్కించబోతున్నారు. వీటి కోసం కళా దర్శకుడు ఆనంద్ సాయి నేతృత్వంలో భారీ
సెట్ ను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్ ను విడుదల
చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ ఖాకీ దుస్తులు ధరించి స్టైలిష్ గా
కనిపిస్తున్నారు. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలో
వినూత్న రీతిలో ప్రజెంట్ చేయబోతున్నాడు. పోలీస్ పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్
మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటుంది అని చిత్ర బృందం పేర్కొంది. శ్రీలీల,
అశుతోష్ రానా, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికిసంగీతం:
దేవిశ్రీప్రసాద్.