బాలీవుడ్ నటుడు మిస్టర్ పర్ఫెక్ట్..అమీర్‌ఖాన్ తల్లి జీనత్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. జీనత్ కు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆస్పత్రి తరలించారు. దీపావళి సందర్భంగా అమీర్ ఖాన్ తన పంచగని ఇంటికి వెళ్లారు. తల్లికి గుండెపోటు వచ్చి పరిస్థితి విషమించడంతో వెంటనే ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడే ప్రస్తుతం జీనత్ కు చికిత్సనందిస్తున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం జీనత్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఆమె చికిత్సకు బాగా స్పందిస్తుందని.. చికిత్స అనంతరం ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే తన తల్లి ఆరోగ్య విషయంలో అమీర్ ఖాన్ సహా మొత్తం కుటుంబ సభ్యులు ఎటువంటి సమాచరం బయటకు రాకుండా చూసుకుంటున్నారు. తన తల్లి ఆరోగ్యంపై మీడియాలో ఎటువంటి పుకార్లు రాయవొద్దంటూ అమీర్ కోరుతున్నారు.