ఇటివలే జాతీయ అవార్డ్..ను సొంతం చేసుకున్న కృతి సనన్ కెరీర్ ప్రారంభంలో తనకు
ఎదురైన ఒక చేదు అనుభవం గురించి సోమవారం ఒక మీడియా సంస్థతో చెప్పింది. నేను
ముంబయికి వచ్చిన కొత్తలో మోడలింగ్ చేస్తూనే.. సినిమా అవకాశాల కోసం
ప్రయత్నిసున్నా. నా అదృష్టం కొద్దీ ఒకేసారి ‘వన్ నేనొక్కడినే’, ‘హీరో పంతీ’
అనే రెండు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఇంకొద్దిరోజుల్లో
చిత్రీకరణ మొదలు కావాల్సి ఉంది. ఈలోగా మొదటిసారి ఒక ర్యాంప్ షోలో
పాల్గొనడానికి వెళ్లాను.
పచ్చికలా ఉన్న లాన్ లో క్యాట్ వాక్ చేస్తున్నా. ఉన్నట్టుండి నేను వేసుకున్న
హీల్స్ మడమలు నేలలో దిగబడిపోయాయి. దీంతో గందర గోళానికి లోనై, మధ్యలోనే
ఆగిపోవడంతో.. ఆ షోకి కొరియోగ్రఫీ చేసిన ఆవిడ వెంటనే గట్టిగా అరుస్తూ.. దాదాపు
యాభై మంది మోడళ్ల ముందు నన్ను దారుణంగా తిట్టింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ
పక్కకి వెళ్లిపోయి చాలాసేపు ఏడ్చాను. జీవితంలో ఆమెతో మళ్లీ కలిసి పని చేయలేదు’
అంటూ ఆనాటి చేదు సంఘటనను గుర్తు చేసుకుంది. కృతి ప్రస్తుతం టైగర్ ష్రాప్ తో
కలిసి ‘గణపత్ పార్ట్ వన్ లో నటిస్తోంది ఈ భామ.