మూడుపదుల వయసు దాటిన ఏమాత్రం తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అగ్ర
కథానాయిక తమన్నా. ఇటీవలే ఈ భామ చిత్రసీమలో 18ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి
చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంభందించిన
ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఈ అమ్మడు గత
కొంతకాలంగా ప్రేమాయాణాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రేమజంట
మాల్దీవుల్లో విహార యాత్రకు వెళ్లొచ్చారు. అయితే విజయ్ వర్మతో తన ప్రేమాయణం
గురించి ఇప్పటివరకు ఎక్కడా పెదవి విప్పలేదు తమన్నా. మీడియా సమావేశాల్లో సైతం
తన ప్రేమ పైనా ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సున్నితంగానే
తిరస్కరిస్తుంటుంది. ఈ సందర్భంగా పెళ్లి గురించి తాను మాట్లాడుతూ ‘భారతీయ
వివాహ వ్యవస్థ పై నాకు పూర్తి నమ్మకం ఉంది. కొన్నాళ్ల క్రితమే వివాహం
చేసుకోవాలనుకున్నాను కానీ కెరీర్ లో బిజీగా మారడంతో పెళ్లి ఆలోచనలకు ఫుల్
స్టాప్ పెట్టాను. ప్రస్తుతం భారీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. నా
పెళ్లి ముచ్చట వినాలంటే చాలా రోజులు వేచి చూడాల్సిందే’ అని చెప్పుకొచ్చింది
మిల్కీ బ్యూటీ.