ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’.
ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట అందులో భాగంగా ఇప్పటికే తొలి
షెడ్యూల్లో షిప్ లో ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు కొరటాల శివ. తాజాగా
‘దేవర’లో కీలకంగా ఉండే మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ నీ ఆరంభించారని టాక్.
పూర్తిగా నీటిలో సాగే ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని
వినికిడి. దాదాపు 20 రోజుల పాటు ఈ ఫైట్ నీ చిత్రీకరించనున్నారట మేకర్స్. ఈ
యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చేందుకు ఎన్టీఆర్ మూడు రోజులు ప్రత్యేక
శిక్షణ తీసుకున్నారట. ఫైట్ మాస్టర్ కింగ్ సోలొమన్ ఈ సీక్వెన్స్ ని డిజైన్
చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ద్వారా నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్
తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్
నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు. కల్యాణ్ రామ్ సమర్పణలో కె.
హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్
5న విడుదల కానుంది.