అగ్ర కథానాయిక అనుష్క ప్రస్తుతం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో
ప్రేక్షకులను అలరిండానికి సిద్దంగా ఉంది. ‘సూపర్’ చిత్రంతో వెండితెరకు
పరిచయమైన ఈమె తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ
భాషల్లో నటించిన అనుష్క ఇప్పుడు ఒక హారర్-ఫాంటసీ సినిమాతో మలయాళంలోనూ
అడుగుపెట్టనుంది. అలాంటి జానర్ లో నటించి మెప్పించడం అనుష్కకు కొత్తేమి కాదు
కానీ మలయాళంలో ఆమెకు మొదటి సినిమా ఇది. ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ అనే
పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత రోజిన్ థామస్
దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నటుడు జయ సూర్య ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ
సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా ఈ
సినిమాలో అనుష్క ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు జయసూర్య ఇన్ స్ట్రా వేదికగా ఒక
మోషన్ పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. అందులో పురాతనమైన అనుష్క
ఫొటోఫ్రేమ్ గోడకు తగిలించి ఉంటుంది. ‘అనుష్కకు స్వాగతం’ అంటూ పోస్టుకు
వ్యాఖ్యను జోడించారు. దానితో ఆమె అందులో ఎలాంటి పాత్ర పోషించనుందోనని
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతీతశక్తులున్న మాంత్రికుడు,
కేరళకు చెందిన పూజారి పాత్రలో జయసూర్య కనిపించనున్నారు. భిన్నమైన కథాంశంతో,
మూడానమ్మకాల నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో విడుదల చేసేందుకు
సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు.