ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం
‘దేవర’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఎన్టీఆర్
జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానుల్లో అంచనాల్ని మరింతగా
పెంచింది. తీరప్రాంత నేపథ్యంలో హై ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషన్స్ తో దర్శకుడు
కొరటాల శివ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ పాత్ర మునుపెన్నడూ
చూడని విధంగా అత్యంత శక్తివంతంగా సాగుతుందని, ముఖ్యంగా సముద్రం నేపథ్యంలో
వచ్చే యాక్షన్ ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమా
మేకింగ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది. కథానుగుణంగా
గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యత ఉందని ఆ హంగుల కోసమే
వందకోట్లు వెచ్చించబోతున్నారని సమాచారం. ఈ సినిమా మేకింగ్ విషయంలో
రాజీపడకుండా, ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది
నిర్మాతల ఆలోచనగా చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ
సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్
మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.